Monday, July 27, 2026
E-PAPER
Homeసినిమా'పొలిమేర 3' మొదలైంది

‘పొలిమేర 3’ మొదలైంది

- Advertisement -


‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2తరువాత దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న విజయవంతమైన హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'పొలిమేర-3గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్‌, నిర్మాత, పంపిణీదారుడు దివంగత నారాయణదాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం సోమవారం సికింద్రాబాద్‌లోని గణేష్‌ ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణ దాస్ నారంగ్ జయంతి సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది.
నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. నిర్మాత బన్నీవాస్‌, ఎగ్జిబిటర్‌ సదానంద్‌ గౌడ్‌ చిత్ర బౌండెడ్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించచారు. అర్జున్ చేరికతో ‘పొలిమేర 3’ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూడో భాగంలో మరింత లోతైన రహస్యాలు, భయానక అతీంద్రియ అంశాలు, సంచలనాత్మక మలుపులతో ‘పొలిమేర’ ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -