Tuesday, July 28, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త రొమాంటిక్ ఎంటర్ టైనర్

సరికొత్త రొమాంటిక్ ఎంటర్ టైనర్

- Advertisement -

హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీ శ్రీ` సినిమాలో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రంగా నిలువనుంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను మేకర్స్ విడుదల చేశారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మరోసారి మనసును హత్తుకునే మధురమైన మెలోడీని అందించారు. అనంత శ్రీరామ్ తన సాహిత్యంతో ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడి భావాలను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కపిల్ కపిలన్ తన మెలోడీ వోకల్ తో పాటకు మరింత అందం తీసుకురాగా, రామ్ మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ విజువల్‌గా పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -