Tuesday, July 28, 2026
E-PAPER
Homeబీజినెస్ఎఐతో ముప్పు తప్పదు

ఎఐతో ముప్పు తప్పదు

- Advertisement -


బాట్‌ల ఆధిపత్యంతో నష్టమే
ఎలాన్ మస్క్ హెచ్చరిక

శాన్‌ఫ్రాన్సిస్కో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రాబోయే పదేళ్లలో మానవ మేధస్సును మించిపోతుందని దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2036 నాటికి బాట్‌లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. మనుషులు చింపాంజీల కంటే తెలివైనవారైనందున వాటిని నియంత్రించినట్లే భవిష్యత్తులో ఎఐ మానవాళి కంటే అత్యంత తెలివైనదిగా మారి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని.. మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ఎఐ వల్ల ఉత్పత్తి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. దానిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని మస్క్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -