- Advertisement -
హైదరాబాద్ : అమెజాన్ మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ ఐదేళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. 2021 నుంచి ఇప్పటివరకు భారత్‌లో 12 వేల మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చినట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 4 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని.. 2026లో దరఖాస్తులు 1.3 లక్షలు దాటగా, మహిళా విద్యార్థుల వాటా 40 శాతానికి చేరింది. ఎంపికైన 3 వేల మందికి జెన్‌ఎఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.
- Advertisement -



