- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
తహశీల్దార్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఉషాసంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో తహశీల్దార్ ఎండి ముజీబ్ చేతుల మీదుగా మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్తానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యే చొరవతో కల్యాణ లక్ష్మి చెక్కులు వేగంగా మంజూరవుతున్నాయని అన్నారు. నిరుపేద ఆడపిల్ల పెండ్లి భారం కాకుండా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తడగూరు గ్రామ సర్పంచ్, మండల సర్వేయర్ వెంకట్రావు, లబ్ధి దారులు పాల్గొన్నారు.
- Advertisement -



