Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

– కౌలాస్ సర్పంచ్ యంబరి విద్య
నవతెలంగాణ – జుక్కల్ 

పర్యవరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కౌలాస్ గ్రామ సర్పంచ్ యంబరి విద్య అన్నారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్ జోషీ, జీపీ కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలోని రొడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల, పశువైద్య శాల, వసతి గృహలు, పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్ లలో తప్పకుండా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ చైతన్యం, పరిజ్ఞానంతో పాటు రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పంటలు బాగా పండి, రైతులకు సిరులు కురిపించాలని, రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తారని వర్ణించారు. దేశాభివృద్ధికి యువత, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఒక్కరూ బాధ్యతగా ఆరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -