Tuesday, July 28, 2026
E-PAPER
Homeఖమ్మంకాంటింజెన్సీ ప్లానింగ్ విత్తన మేళా 

కాంటింజెన్సీ ప్లానింగ్ విత్తన మేళా 

- Advertisement -

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి 
నవతెలంగాణ-కల్లూరు 

ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు పడకపోతే రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకునేందుకు విత్తన మేళ విత్తన మేళా నిర్వహిస్తున్నామని, రైతులు సద్వియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి ఎం.రూప రైతులను కోరారు. రైతులకు వర్షాభావం, ఆలస్యంగా వచ్చే వర్షాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడం  అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఈరోజు కాంటింజెన్సీ ప్లానింగ్ విత్తన మేళా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్  నాయక్  చేతుల మీదగా విత్తనాలు రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. రైతులు పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయవలసిన ప్రత్యామ్నాయ పంటలు, మెట్ట ప్రాంతాలకు అనువైన పంటల ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ  నీటి యాజమాన్యంపై సూచనలు అందించారు.

అదేవిధంగా రైతులకు నాణ్యమైన విత్తనాల లభ్యత, వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంట సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారు లు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -