Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం 

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవన నిర్మాణానికి ఒక్క కోటి 90 లక్షలు రూపాయల నిధులు మంజూరు చేసినందుకు, అంబేద్కర్ సంఘం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం  మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చిత్రపటాలకు  పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు వెంకటయ్య మాట్లాడారు. మండల కేంద్రంలో అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణానికి దళితులు, ప్రజాసంఘాల, నాయకులు సహాయ సహకారం అందించాలని కోరారు.

కళాభవన నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూచామని గొప్ప మనసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకారంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కళాభవనం పూర్తి అయితే అన్ని వర్గాలకు ప్రజలకు , విద్య ,సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.  కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, దళిత సంఘం నాయకులు బాలయ్య, వాడ్యాల్ విజయ్ కుమార్, సాయిలు, బుచ్చయ్య, భాస్కర్ రెడ్డి, మసిగుండ్లపల్లి సర్పంచ్ శ్రీశైలం యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, మాజీ సర్పంచులు వెంకటేష్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ నాయక్, శ్రీనివాసులు బిర్లా మల్లయ్య , బీరయ్య, వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షులు పసుల శివ, బాలస్వామి, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -