Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం

రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం

- Advertisement -

పశువుల యజమానులకు పరకాల మున్సిపాలిటీ హెచ్చరిక
నవతెలంగాణ -పరకాల 

పరకాల పట్టణంలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలే యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ. పవన్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆవులు, గేదెలు సంచరించడం వల్ల వాహనదారులు, పాదచారులు, సాధారణ ప్రజలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశువుల యజమానులు ప్రకటన విడుదలైన తేదీ నుంచి మూడు రోజులలోపు తమ పశువులను రహదారుల నుంచి తొలగించి ఇంటి ఆవరణలో లేదా తగిన ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత కూడా రహదారులపై సంచరించే పశువులను పురపాలక సంఘం స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని, అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా పశువుల యజమానులు మున్సిపాలిటీకి సహకరించి తమ పశువులను రోడ్లపై విడిచిపెట్టకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -