- Advertisement -
రీల్స్ చేయడం
మీమ్స్ పెట్టడం
ఇన్‌స్ర్టాగామ్ వాడటం
మాకూవచ్చు బ్రో!
మసిపూసే
మారేడు కాయలకు
కాలం చెల్లింది
పాలు తాగే పిల్లి ఇక
కండ్లు తెరవాలి బ్రో!
కక్కిన కూడు
ఇంతకాలం తింటావ్?
అబద్ధాల గోడలు
ఇకచాలు బ్రో!
ముఖం బాలేదని
అద్దం పగల కొట్టకు
నీకైనా నీవు
న్యాయం చేసుకో బ్రో!
పారదర్శకత
కావాలంటాం
జవాబుదారీ
చూపాలంటాం
ప్రాణాలకు తెగించాం
పెత్తనాన్ని
ఒక తొక్కుతొక్కాం
ప్రజాస్వామ్య విజయం
ఇదే బ్రో!
వేయి మాటలెందుకు ?
కాక్రోచ్ మీసాలు ఇప్పుడు
చాలా పొడుగు బ్రో!
- శాంతారావు,9959745723
- Advertisement -



