Tuesday, July 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచాలా పొడుగు బ్రో!

చాలా పొడుగు బ్రో!

- Advertisement -

రీల్స్‌ చేయడం
మీమ్స్‌ పెట్టడం
ఇన్‌‌స్ర్టాగామ్‌ ‌వాడటం
మాకూవచ్చు బ్రో!
​మసిపూసే
మారేడు కాయలకు
కాలం చెల్లింది
పాలు తాగే పిల్లి ఇక
కండ్లు తెరవాలి బ్రో!
​కక్కిన కూడు
ఇంతకాలం తింటావ్?
అబద్ధాల గోడలు
ఇకచాలు బ్రో!
ముఖం బాలేదని
అద్దం పగల కొట్టకు
నీకైనా నీవు
న్యాయం చేసుకో బ్రో!
​పారదర్శకత
కావాలంటాం
జవాబుదారీ
చూపాలంటాం
ప్రాణాలకు తెగించాం
పెత్తనాన్ని
ఒక తొక్కుతొక్కాం
ప్రజాస్వామ్య విజయం
ఇదే బ్రో!
​వేయి మాటలెందుకు ?
కాక్రోచ్ మీసాలు ఇప్పుడు
చాలా పొడుగు బ్రో!
​- శాంతారావు,9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -