నవతెలంగాణ-మద్నూర్
ఈ ఏడాది లేనినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో చేపట్టే జలసిరి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మండల స్థాయి సమీక్ష సమావేశంలోఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావుల ఆధ్వర్యంలో నిర్వహించే జలసిరి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ లోకండి ఆకాష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అదేవిధంగా పెద్ద షక్కర్గా గ్రామంలో గ్రామ సర్పంచ్ విశాలాక్షి రామ్ పటేల్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. వీటితో పాటు పెద్ద తడుగూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న అధ్యక్షతన గ్రామసభ జరిగింది. తడి హిప్పర్గా గ్రామంలో గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో జలసిరిలో నిర్వహించే పనుల గురించి గ్రామస్తులకు ఆయా గ్రామాల కార్యదర్శులు వివరించారు. జలసిరి గ్రామసభలకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జలసిరి కార్యక్రమాల విజయవంతానికి గ్రామసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



