Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 

అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
మండలంలోని శ్రీ ఉమా మహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను కామర్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  రవి పరంగి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు, మార్కుల మెమోలు, అనుభవ పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతో కలిసి ఈ నెల 31 సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలం ను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా తెలియజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత సబ్జెక్టులో పీజీ లో జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పిహెచ్ డి,నెట్, స్లెట్సెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -