Wednesday, July 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పూర్తిస్థాయి వైద్యులను నియమించాలి.. 

పూర్తిస్థాయి వైద్యులను నియమించాలి.. 

- Advertisement -

డీఎంహెచ్‌వోకు సర్పంచ్‌ల వినతి..
నవతెలంగాణ-బజార్ హత్నూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని సందర్శించిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ లకు బజార్ హత్నూర్ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పరచ సాయన్న ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. 31 గ్రామ పంచాయతీలకు ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండగా, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై వచ్చిన ఒకే ఒక్క వైద్యుడు మాత్రమే సేవలందిస్తున్నారని తెలిపారు. దీంతో మండల ప్రజలు, ముఖ్యంగా సుమారు 60 శాతం ఆదివాసీ, నిరుపేద కుటుంబాలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లారు.

మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యులను, అవసరమైన వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలని వారు కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన డీఎంహెచ్‌వో సమస్యను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు గ్రామాల సర్పంచ్‌లు మెస్రం మాధవ్, రజాక్, కైలాష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -