Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవo

ఆలేరు సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవo

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున కాకడ హారతితో ప్రారంభమైన కార్యక్రమాలు రోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. అనంతరం 108 కలశాలతో శ్రీ సాయిబాబాకు పంచామృత మహాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన అభిషేక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందారు.

అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించగా, మధ్యాహ్న మహా మంగళహారతి, మహా నైవేద్యం ఘనంగా సమర్పించారు. కార్యక్రమం అనంతరం దేవాలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని గురుపౌర్ణమి వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ..”గురుపౌర్ణమి అనేది గురువును స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు. సాయిబాబా చూపిన సేవా మార్గం, ప్రేమ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆలేరు సాయిబాబా దేవాలయ అభివృద్ధికి ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తాం. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ట్రస్ట్ సభ్యులకు, దాతలకు, భక్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ అశోక్, ట్రస్ట్ సభ్యులు సముద్రాల సత్యం, మురారిశెట్టి రాజేశ్వర్, సీత నవీన్, కటకం హనుమంతరావు, అయిత వెంకటేశ్వర్లు, వెనిశెట్టి సుధాకర్, పూసలోజు సుదర్శన్, మడిపల్లి సత్యం, పల్లా వెంకటరెడ్డి, మురారిశెట్టి వెంకటేష్, గందె అంజయ్య, సముద్రాల శ్రీనివాస్, నవీన్ కుమార్ రెడ్డి (హైదరాబాద్)తో పాటు ఇతర ట్రస్ట్ సభ్యులు, దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -