– గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి
– మండల పరిషత్ ప్రత్యేక అధికారి కే. శ్రీనివాస్
నవతెలంగాణ – అశ్వారావుపే
గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్థానిక అవసరాల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మండల పరిషత్ ప్రత్యేక అధికారి కే. శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వాల్మీకి కిశోర్ అధ్యక్షతన జీపీడీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలను సమావేశంలో వివరించి వినిపించారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి, అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్, గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమగ్ర అభివృద్ధికి జీపీడీపీ కార్యాచరణే మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



