- Advertisement -
నవతెలంగాణ – తొగుట
కాన్గల్ గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యేకు గ్రామ ఉప సర్పంచ్ మాదారం ప్రశాంత్ వినతిపత్రం అందజేశారు. బుధవారం మండలంలోని తుక్కపూర్ ఎక్స్ రోడ్ నుండి కాన్గల్ మీదుగా లింగంపేట రోడ్ వరకు నిర్మాణం చేయాలని కోరారు. గ్రామంలో అంతర్గత రోడ్ల, మురికి కాలు వలు, సీసీ కెమెరాలు, ఓపెన్ జిమ్ ల కోరకు ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ వైస్ ఎంపీపీ బాసి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్యా, బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్య క్షుడు రాంరెడ్డి, సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



