Thursday, July 30, 2026
E-PAPER
Homeక్రైమ్మ్యాన్ హోల్‌‌లో పడి 
వృద్ధుడు గల్లంతు

మ్యాన్ హోల్‌‌లో పడి 
వృద్ధుడు గల్లంతు

- Advertisement -


24 గంటలు గడిచినా లభించని ఆచూకీ
నవతెలంగాణ – శేరిలింగంపల్లి

మురుగు నీరు సాఫీగా వెళ్లడం కోసం జరుగుతున్న నాలా పనుల నిర్మాణం కారణంగా తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌‌లో ఓ వృద్ధుడు గల్లంతైన ఘటన రంగారెడ్డి జిల్లా మియాపూర్ పీఎస్‌ పరిధిలో జరిగింది. ‌బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నుంచి రైల్వే అండర్ పాస్ నుంచి హఫీ‌జ్‌పేట్ వైపు వెళ్లేందుకు రైల్వే బ్రిడ్జి వద్ద నాలా నిర్మాణం పనులు జరుగుతుండ‌టంతో మ్యాన్ హోల్ తెరిచిపెట్టారు. హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్‌‌కు చెందిన బాలయ్య(70) అనే వృద్ధుడు బయటకు వెళ్ళాడు. వర్షం పడుతున్న కారణంగా రైల్వే బ్రిడ్జి కిందకు వెళ్లి ఉన్నాడు. అక్కడే తెరిచిన మ్యాన్ హోల్‌‌లో పడి గల్లంతయ్యాడు. వర్షంతో నీరు అధికంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పీఏసీ చైర్మెన్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మియాపూర్ పోలీసులు, సీఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో పాటు వరద ప్రభావం కూడా ఎక్కువ కావడంతో అతని ఆచూకీ లభించలేదు. దాంతో బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. బుధవారం కూడా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతని ఆచూకీ లభించలేదు. బాలయ్య ఆచూకీ లభ్యమయ్యే వరకూ గాలింపు చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -