న్యూఢిల్లీ : ఓ వైపు న్యూఇయర్ వేడుకల కోసం ప్రజలు సిద్ధమవుతుండగా .. పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదువుతున్నాయి. దేశంలో అత్యధికంగా 34 కేసులు గోవాలో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం వరకు దేశంలో మొత్తం 63 జెఎన్-1 సబ్ వేరియంట్ కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయి. కేసు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. దేశంలో 628 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4,054గా ఉంది. కర్నాటకలో అత్యధికంగా 125 కరోనా కొత్త కేసులు ఉండగా, 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 436గా ఉంది. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోవిడ్ పరీక్షలను పెంచినట్లు తెలిపింది. ఇప్పుడు రోజుకు 3 నుంచి 4 కేసులే వస్తున్నాయి. 1శాతం కన్నా తక్కువేనని తెలిపింది. తెలంగాణాలో 10 పాజిటివ్ కేసులు నమోదవగా, యాక్టివ్ కేసుల సంఖ్య 153కి పెరిగింది. 8,40,392మంది కొవిడ్ రోగులు రికవర్ అయ్యారు.