Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెల్ ఫోన్ల దొంగ అరెస్ట్ 

సెల్ ఫోన్ల దొంగ అరెస్ట్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లో సెల్ఫోన్లను దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి తన సిబ్బందితో ఆర్పీఎఫ్ స్టాఫ్ కలిసి ప్లాట్ఫారం చెక్ చేస్తుండగా రైల్వే ప్లాట్ఫామ్ పై అనుమానస్పదంగా తిరుగుతున్న మమ్మల్ని చూసి పారి పోతుంటే వెంటనే అతనిని పట్టుకుని విచారించామన్నారు. విచారణలో కొత్తపల్లి గ్రామం మాక్లూరు మండలానికి చెందిన  బొజ్జ ప్రవీణ్  అని తెలుపుతూ అతని వద్ద ఉన్న ఒక ఐ ప్యాడ్, రెండు సెల్ ఫోన్స్ ట్రైన్ లలో దొంగిలించిన వస్తువులు అని తెలపగా వెంటనే అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -