తెలంగాణ – వనపర్తి : ఏదుల మండల కేంద్రంలో అనారోగ్యాలతో మరణించిన బొల్లె చిన్న లక్ష్మయ్య, కమ్మరి రాఘవచారి, పిల్లెల్ల రాములు కుటుంబాలకు మేఘన్న అభయహస్తం ద్వారా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5000ల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బొల్లె చిన్న లక్ష్మయ్య, కమ్మరి రాఘవచారి, పిల్లెల్ల రాములు ఇటీవల మరణించిన విషయాన్ని ఏదుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పందెం సుఖేందర్ రెడ్డికి తెలిపారు. ఆయన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి మేఘన్న అభయస్తం ద్వారా 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఏదుల గ్రామ సర్పంచ్ పరశురామ్ యాదవ్, ఉప సర్పంచ్ శేషి రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ గోపాల్పేట్ మండల అధ్యక్షులు జానకిరామ్ యాదవ్, ఏదుల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ యాదవ్, కడారి శివ, వార్డు మెంబర్ మల్లయ్య , జి శ్రీనివాస్ రెడ్డి, బొల్లె వెంకటయ్య, కృష్ణయ్య, రాజు, దాసు, జి.హనుమంతు, అయ్యన్న, పి. కృష్ణయ్య, బలరాం, రాముడు కుటుంబ సభ్యులు మరియు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు 5వేల ఆర్థిక సహాయంనవ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



