Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ

వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఆలూరు  తహసిల్దార్ కార్యాలయ ఆర్ఐ  గది ప్రహరీ గోడ కూలింది. ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దయనీయ స్థితిలో ఉండటంతో అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా పశువైద్యశాల భవనంలో కొనసాగుతున్న కార్యాలయం గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది.

గురువారం కార్యాలయంలోని ఆర్‌ఐ గది ప్రహరీ గోడ  కూలిపోవడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భవనం పరిస్థితి రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పైకప్పు నుంచి నీరు కారడంతో కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, విద్యుత్ పరికరాలు ముద్దవుతున్నాయి. దీంతో ప్రజలకు అందించాల్సిన సేవలు కూడా అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడుతోంది.విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండి సేవలందించే రెవెన్యూ శాఖ సిబ్బందే ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలూర్ తహసీల్దార్ కార్యాలయానికి వెంటనే శాశ్వత నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మించాలని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి భవనాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -