Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడురోజులుగా ముసురుకుంది..!

మూడురోజులుగా ముసురుకుంది..!

- Advertisement -

– ఎడతెరిపిలేకుండా జల్లులు
– సాగులో ఉన్న పంటలకు ప్రయోజనకరం
నవతెలంగాణ – మల్హర్ రావు
: మూడు రోజులుగా మండల వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.దీంతో మండలంలో రోజంతా నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.ఇంకా బారి వర్షాలు కురుస్తాన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మండలంలో ఈ ఖరీఫ్ లో 22,300 ఎకరాల్లో సాగవుతున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 14,800 ఎకరాల్లో వరి,3600 ఎకరాల్లో పత్తి,2500 ఎకరాల్లో మిర్చి పంటలు వేస్తారని తెలిపారు.కురుస్తున్న వర్షాలతో పత్తికి ప్రయోజనం చేకూరుతే వరి, మిర్చి పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతుల్లో ఆశలు కలుగుతున్నాయి.మొన్నటి వరకు కుంటలు,చెరువులు,వాగుల్లో చుక్క నీరు లేక వెలవెలబోయాయి.మూడు రోజుల ముసురుతో మానేరు,తిగలవాగు,అరేవాగు,కల్వర్టులు ఉప్పొంగాయి.చిన్నతరహా ప్రాజెక్టులైన కాపురం చెరువు,బొగ్గులవాగు ప్రాజెక్టుల్లోకి సంవృద్దిగా నీరు చేరింది.చెరువులు,కుంటలు నిండుకుండలా మారి మత్తళ్ళు దుకాయి.దీంతో ఆయకట్టు సన్నచిన్న కారు రైతుల్లో వరి సాగుకు ఆశలు చిగురించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అంతర్గత రోడ్లన్నీ బురదమయంగా మారాయి. డ్రైనేజీలు, మురికి కాల్వలు రోడ్లపై పారాయి. వర్షాలు కారణంగా మత్స్యకారులతో పాటు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడవరోజు తాడిచర్ల ఓసిపిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -