నవతెలంగాణ – కామారెడ్డి : గజ్యానాయక్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ భర్త జోక్యం, పెత్తనం కొనసాగుతోందని ఆరోపిస్తూ వార్డు సభ్యులు గురువారం గ్రామ పంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేసినట్లు వార్డు సభ్యులు పేర్కొన్నారు. వినతిపత్రంలో, గ్రామ సర్పంచ్‌గా రావుల వినోద రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారని, మహిళా సాధికారతలో భాగంగా మహిళలకు రాజ్యాంగం పరిపాలనలో ప్రత్యేక స్థానం కల్పించిందని పేర్కొన్నారు. అయితే గ్రామ పంచాయతీ పరిపాలనలో సర్పంచ్ భర్త జోక్యం కొనసాగుతుండగా, కార్యదర్శి కూడా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, నిధుల వ్యయం వంటి అంశాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం, పాలకవర్గ సభ్యుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ వాటిని పాటించడం లేదని వార్డు సభ్యులు పేర్కొన్నారు. సర్పంచ్ భర్త పెత్తనం పూర్తిగా నిలిపివేసి, రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీ పరిపాలన నిర్వహించే వరకు అధికారిక సమావేశాలను బహిష్కరిస్తామని తమ వినతిపత్రంలో స్పష్టం చేశారు.
సర్పంచ్ భర్త పెత్తనం..జీపీ సమావేశాన్ని బహిష్కరించిన వార్డు సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



