Thursday, July 30, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విశారదన్ మహరాజ్ అరెస్టు ప్రజాస్వామికం

విశారదన్ మహరాజ్ అరెస్టు ప్రజాస్వామికం

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) అధినేత డా. విశారదన్ మహారాజ్ చేపట్టిన లక్ష కిలోమీటర్ల ‘మా భూమి’ రథయాత్రను అడ్డుకుని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్, డీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ విమర్శించారు.

గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ‘మా భూమి’ రథయాత్ర సందర్భంగా డా. విశారదన్ మహారాజ్‌ను పోలీసులు అడ్డుకుని బుధవారం రాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం సరికాదన్నారు.

వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆ సమస్యపై ధర్నా నిర్వహించినందుకే అరెస్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను కేసులు, అరెస్టులతో నిర్బంధించడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.

డీఎస్పీ అధినేత డా. విశారదన్ మహారాజ్‌తో పాటు పార్టీ నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘మా భూమి’ రథయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇల్లు లేని పేదలకు గృహాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్న నేపథ్యంలో డీఎస్పీ అధినేత ప్రజల తరఫున ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, పోలీసుల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, మీడియా ఇన్‌చార్జి అగ్గిమల్ల నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -