నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని హర్షిని ఆధార్ సెంటర్ ను గురువారం తహశీల్దార్ గుర్రం బాలయ్య ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ గుర్రం బాలయ్య మాట్లాడుతూ ఆధార్ కేంద్రాలకు వచ్చే వారి నుండి మొబైల్ లింక్ అప్డేట్ కు 75/- రూపాయలు, బయోమెట్రిక్ పెద్దలకు 125/-, మాండేటరీ బయోమెట్రిక్ 75/- ,అడ్రస్ చేంజ్, నేమ్ చేంజ్ కు 75/- రూపాయలు, న్యూ ఎన్రోల్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉచితంగా , ఇతర వాటికి పైన పేర్కొన్న విధంగానే డబ్బులు చెల్లించాలని అంతకంటే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే తహశీల్దార్ ఇందల్వాయి కు ఫిర్యాదు చేయాలని మండల ప్రజలకు సూచించారు. అయన వేంట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్.ఐ ప్రవీణ్ కుమార్, జిపిఓలు ప్రమోద్, సాయన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ కేంద్రం తనిఖీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



