- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ రూ.11, 111 విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ కర్ల సాయిల్ కు అందజేశారు. ఈ క్రమంలో గంగాధర్ కు ఆలయ కమిటీ తరఫున చైర్మన్ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, గ్రామ అధ్యక్షులు బండి గోపి, పెద్ద తడగూర్ గ్రామ సర్పంచ్ ఈరన్న, ఆలయ కమిటీ సభ్యులు ఐన్లవార్ హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



