Friday, July 31, 2026
E-PAPER
Homeఆటలుప్రతిభావంతులకు శాస్త్రీయ శిక్షణ!

ప్రతిభావంతులకు శాస్త్రీయ శిక్షణ!

- Advertisement -

రాష్ర్ట క్రీడా సంఘాలతో శాట్జ్‌ ఎండీ సోనీబాలా దేవి
నవతెలంగాణ- హైదరాబాద్

ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుండగా… పోటీల్లో పతకాలు సాధించగల ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, శాస్త్రీయ విధానంలో శిక్షణ అందించే కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) వీసీ, ఎండీ సోనీబాలా దేవి అన్నారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ సన్నద్ధతలో భాగంగా గురువారం ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్‌, బ్యాడ్మింటన్‌, మల్లఖంబ్‌, గట్కా, కలరిపట్టు క్రీడా సంఘాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ‘ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో పతకాలు సాధించగల రాష్ట్ర క్రీడాకారులను గుర్తించాలి. ప్రతిభావంతులకు శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇవ్వాలి. పోటీలకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపట్టాలి. సెలక్షన్స్‌ ట్రయల్స్‌, ఫస్ట్‌ లెవల్‌ క్యాంప్‌, చివరగా కోర్‌ క్యాంప్‌ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలి. ప్రతి దశకు నిర్దిష్టమైన కాల వ్యవధి, శిక్షణా ప్రణాళిక, మౌలిక వసతులు, క్రీడా సామాగ్రి, కోచ్‌ల నియామకంపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తున్నాం. ఈ ప్రక్రియలో క్రీడా సంఘాలకు శాట్జ్‌ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని’ సోనీబాలా దేవి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -