Saturday, August 1, 2026
E-PAPER
Homeజాతీయంరష్యా నుంచి రెట్టింపైన చమురు దిగుమతులు

రష్యా నుంచి రెట్టింపైన చమురు దిగుమతులు

- Advertisement -

మొత్తం దిగుమతుల్లో 55.3 శాతం..జులైలో భారత్‌ ఆల్ టైమ్ రికార్డ్..
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల మధ్య రష్యా ముడి భారత్ చమురు కొనుగోళ్లను రికార్డ్‌ ‌స్థాయిలో పెంచింది. జులై నెలలో రష్యా నుంచి రోజుకు 2.78 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు దిగుమతి జరిగింది. ఇప్పటి వరకు జరిగిన దిగుమతుల్లో ఇదే ఆల్‌‌టైం రికార్డ్‌‌గా నిలిచింది. దేశం మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 55.3 శాతానికి చేరగా.. జూన్‌తో పోలిస్తే రష్యా సరఫరా 1.8 శాతం పెరిగింది. మొత్తం దిగుమతులు స్వల్పంగా మాత్రమే పెరిగినప్పటికీ రష్యా ప్రధాన సరఫరాదారుగా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈఏడాది జనవరిలో 23.4 శాతంగా ఉన్న రష్యా వాటా.. ప్రస్తుతం రెండింతలకు పైగా పెరిగి 55 శాతాన్ని దాటడం విశేషం. రష్యా చమురు సరఫరా పెరగడానికి పలు అంతర్జాతీయ పరిణామాలు కారణమయ్యాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా రిఫైనింగ్ కార్యకలాపాలు దెబ్బతినడంతో ఎగుమతికి ఎక్కువ ముడి చమురు దుబాటులోకి వచ్చింది. అలాగే అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గిన సమయంలో గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణం ప్రారంభించడంతో భారత్‌కు సరఫరా సులభమైంది. రష్యా ఇచ్చే డిస్కౌంట్లు బ్యారెల్‌కు కేవలం 2–3 డాలర్లకు తగ్గినా భారత రిఫైనర్లు కొనుగోళ్లు తగ్గించలేదు. పశ్చిమాసియా దేశాల నుంచి కూడా దిగుమ తులు జులైలో కొంత పెరిగాయి. యుఎఇ రోజుకు 4.89 లక్షల బ్యారెల్స్‌తో రెండో అతిపెద్ద సరఫ రాదారుగా నిలిచినప్పటికీ జూన్‌తో పోలిస్తే దాని సరఫరా తగ్గింది. సౌదీ అరేబియా నుంచి దిగుమ తులు మాత్రం 55 శాతం పెరిగి రోజుకు 4.53 లక్షల బ్యారెల్స్‌కు చేరాయి. మరోవైపు అట్లాంటిక్ ప్రాంత దేశాల నుంచి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. వెనిజులా, బ్రెజిల్, అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గగా, నైజీరియా నుంచి మాత్రం దిగుమతులు పెరిగాయి. దీంతో భారత చమురు దిగుమతుల్లో రష్యాపై ఆధారపడటం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -