Saturday, August 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదవగా, తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 5 శాతానికి తగ్గినట్టు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -