Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మునిసిపల్ కౌన్సిల్ సభ్యులకు ఒరియేంటేషన్ కార్యక్రమం

మునిసిపల్ కౌన్సిల్ సభ్యులకు ఒరియేంటేషన్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పురపాలక సంఘం కౌన్సిల్ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఈఎస్‌సీఐ (ESCI)లో నిర్వహించిన ఒకరోజు ఒరియేంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, ప్రజా సేవల నాణ్యత పెంపు, స్థానిక సంస్థల బాధ్యతలు, పాలనలో పాటించాల్సిన విధివిధానాలపై నిపుణులు సభ్యులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ విధులు, బాధ్యతలకు సంబంధించిన పలు అంశాలపై మార్గదర్శకాలను తెలుసుకున్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అవసరమైన విధానాలపై ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్థానిక సంస్థల పాలనలో మెరుగైన పనితీరు కనబర్చేందుకు అవసరమైన అవగాహన ఏర్పడుతుందని పరకాల మున్సిపల్ కమిషనర్ పి.పవన్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -