Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: ఎండి అబ్బాస్

పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే: ఎండి అబ్బాస్

- Advertisement -

నవతెలంగాణ – పరకాల
పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ అన్నారు. పరకాలలో శనివారం ప్రారంభమైన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు అబ్బాస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరుడు కామ్రేడ్ రౌతు మనోహర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం కారణంగా అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని, ఉపాధి అవకాశాలు తగ్గుతూ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రజల జీవితాలు మెరుగుపడాలంటే సోషలిజమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.

సామ్రాజ్యవాద దేశాలు పేద దేశాల సంపదను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపై అధిక సుంకాలు విధిస్తూ ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. దీనిని వ్యతిరేకించే దేశాలపై యుద్ధాలు ప్రకటిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని, నిరుద్యోగం, పేదరికం, రైతులు, కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు నష్టం చేసే విధంగా చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు.ఆగస్టు 20న దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో కార్యకర్తలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం “వర్గాలు–వర్గపోరాటాలు” అంశంపై సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు మూడ్ శోభన్ నాయక్ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణకు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.

కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కే. లింగయ్య, పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్, నాయకులు గాదె రమేష్, బొచ్చు ఆదాం, జి. మహేందర్, బి. నారాయణ, ప్రమోద్, దాసరి అనిత, శనిగారపు సంధ్య, రౌతు శ్రీలత, చరణ్ మోహన్, ఏసుబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -