Friday, September 11, 2026
E-PAPER
Homeజిల్లాలుచైతన్య మోడల్ హైస్కూల్‌లో ఘనంగా రైన్ డే వేడుకలు

చైతన్య మోడల్ హైస్కూల్‌లో ఘనంగా రైన్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పట్టణంలోని చైతన్య మోడల్ హైస్కూల్‌లో శనివారం రైన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్షాకాలాన్ని ప్రతిబింబించేలా చిన్నారులు ఆకర్షణీయమైన వేషధారణలో పాల్గొని సందడి చేశారు. రంగురంగుల రెయిన్ కోట్లు, గొడుగులు, రెయిన్ బూట్లు ధరించిన విద్యార్థులు వర్షాకాలానికి సంబంధించిన చిత్రలేఖనాలు, కళాత్మక నమూనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల ఉత్సాహం, సృజనాత్మకత కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ యుగేందర్, వైస్ ప్రిన్సిపల్ ఫారహా, హాస్టల్ ఇన్‌చార్జ్ సౌమ్య రెడ్డి, ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.అలాగే వర్షాకాలం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -