Saturday, August 1, 2026
E-PAPER
Homeఖమ్మంఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

– ​ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ
– మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లి పట్టణంలో ​ఆగస్టు 23, 24వ తేదీల్లో జరగబోయే ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ కోరారు. శనివారం మండల పరిధిలోని గంగారం, రామానగరం గ్రామాల్లో జరిగిన తాపీ వర్కర్స్ యూనియన్ సమావేశాల్లో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్మికులతో కలిసి మహాసభల కరపత్రాలను  ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను కార్మికుల ఖాతాల్లో జమ చేసే విధంగా కార్మిక శాఖ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 23, 24 తేదీల్లో సత్తుపల్లిలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు. ​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్  జిల్లా నాయకులు తడికమళ్ల యోబు, కంచి శ్రీనివాసరావు, తాపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కనపర్తి మాల్యాద్రి, పలగాని శీను, రఘు, భవానీ, గురవయ్య, జానయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, చిరంజీవి, పుల్లారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -