•ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద
నవతెలంగాణ-మర్రిగూడ
అమ్మ పాలు అమృతంతో సమానం అని ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద అన్నారు.శనివారం మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతల ఇండ్లను సందర్శించి బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వటం వలన పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరు నెలలు కేవలం అధిక పోషకాలు కలిగిన తల్లిపాలను మాత్రమే ఇవ్వాలని తల్లులకు అవగాహన కల్పించారు.మండలంలో ఆయా గ్రామాలలో తేదీలవారీగా ఈ నెల 01 నుండి 07 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఛాయా లక్ష్మి,ఫై మీనా,అంగన్వాడి టీచర్ సాలమ్మ,ఆశా కళమ్మ,ఆయా యాదమ్మ,తల్లులు పాల్గొన్నారు.
అమ్మ పాలు అమృతంతో సమానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



