నవతెలంగాణ – మల్హర్ రావు
తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి పూజా కలశం వల్లెంకుంట గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు శనివారం అంగరంగ వైభవంగా పూజలతో ఊరేగింపు నిర్వహించారు. ఇట్టి కలశాన్ని గ్రామ ప్రజలు, ఆడపడుచులు అందరూ ఊరేగింపుగా ఊరేగించి భక్తంజనేయ స్వామి ఆలయం వద్ద స్థాపించి పూజలు చేశారు. సందర్శకులు ప్రత్యేక అలంకరణతో ఊరేగింపును ప్రారంభించారు. భక్తంజనేయ స్వామి ఆలయం వరకు కలశపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంట పైరు పండేలా, గ్రామ ప్రజలు ఆయురారోగ్యంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవుని ఆశీస్సులు ఉండాలని ఏడుకొండల స్మరణలతో నినాదాలు చేస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
వల్లెంకుంటలో వైభవంగా కలశం ఊరేగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



