Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రెల కాపరులకు కర్ణాటక తరహాలో లైసెన్స్ తుపాకులు ఇవ్వాలి

గొర్రెల కాపరులకు కర్ణాటక తరహాలో లైసెన్స్ తుపాకులు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
గొర్రెలు, మేకల పెంపకందారుల ఆత్మరక్షణ కోసం కర్ణాటక తరహాలో లైసెన్స్‌తో కూడిన తుపాకులు మంజూరు చేయాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) హనుమకొండ జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ బండారి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పరకాల మండలం సీతారాంపురంలో సంఘం అధ్యక్షుడు ఓదెల బాలకొమురు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గొర్రెలు, మేకల పెంపకం తరతరాలుగా అనేక కుటుంబాలకు జీవనాధారంగా కొనసాగుతోందని తెలిపారు. పశువులను మేపేందుకు అడవులకు వెళ్లే సమయంలో దోపిడీ దొంగలు, క్రూరమృగాల దాడుల నుంచి కాపరులు రక్షణ పొందేందుకు కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని లైసెన్స్‌తో కూడిన తుపాకులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం కామారెడ్డి, సీతారాంపురం తదితర గ్రామాలను సందర్శించారు. గొర్రెలు, మేకలకు నిర్వహిస్తున్న పీపీఆర్–ఈటీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోందని, దీన్ని వేగవంతం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కోరారు.

ఈ సందర్భంగా ఆగస్టు 22 నుంచి 24 వరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్లలో నిర్వహించనున్న గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో గత కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. తొలి రోజు గొల్ల, కురుమ కాపరుల కుటుంబాలకు చెందిన కవులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో, మూడో రోజుల్లో ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెంపకందారులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గండ్రకోట కుమార్, ఉడుత విజయ్, మహేందర్, బైకాని రమేష్, ఉడుత రమేష్, జింకజువ్వ రాజయ్య, ఉడుత సంతోష్, ఇష్టబోయిన ఉదయ్, ఉడుత లింగమూర్తి, ఓదెల శ్రీనివాస్, ఇష్టబోయిన హరీష్, ఐలుమల్లు, ఉడుత నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -