Saturday, August 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ..

తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం పరకాల ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరకాల సీడీపీవో సింధూరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరకాల పీడియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ మరియు వైద్య నిపుణులు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపు తల్లి నుంచి వచ్చే ముర్రు పాలను తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల అనంతరం తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాలని వివరించారు. అలాగే శిశువుకు కనీసం రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ విక్రమ్, డైటీషియన్ తిరుపతి, విధుల్లో ఉన్న వైద్యులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిపాల వల్ల తల్లి, బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -