Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిన్లాండ్ విదేశీ అధ్యయన పర్యటనకు ఉదావత్ లచ్చిరాం ఎంపిక

ఫిన్లాండ్ విదేశీ అధ్యయన పర్యటనకు ఉదావత్ లచ్చిరాం ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
ఫిన్లాండ్ విదేశీ అధ్యయన పర్యటనకు మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం ఎంపికయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల విదేశీ అధ్యయన పర్యటనకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ఈ నెల 26 నుండి అక్టోబర్ 3 వరకు ఫిన్లాండ్ దేశంలో నిర్వహించనున్న విదేశీ అధ్యయన పర్యటనకు ఎంపికైన 33 మంది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. జిల్లా నుంచి ఎస్జీటీ క్యాడర్‌లో మండలంలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఉదావత్ లచ్చిరాం ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం ఆయన చేస్తున్న కృషికి ఇది గుర్తింపుగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం శుక్రవారం పాఠశాల విరామ సమయంలో లచ్చిరాంను శాలువాతో సన్మానించారు. ఫిన్లాండ్ విద్యా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులు మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసి, వాటిని మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -