Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డివైఎఫ్ఐ జిల్లా కమిటీకి మొరిగాడి పృథ్వి, యాసరపు ప్రసాద్ ఎన్నిక

డివైఎఫ్ఐ జిల్లా కమిటీకి మొరిగాడి పృథ్వి, యాసరపు ప్రసాద్ ఎన్నిక

- Advertisement -

బలమైన యువజన ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలి: రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

చౌటుప్పల్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) మూడో జిల్లా మహాసభల్లో ఆలేరు పట్టణానికి చెందిన డీవైఎఫ్ఐ అధ్యక్షుడు యాసరపు ప్రసాద్, కార్యదర్శి మొరిగాడి పృథ్వి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలో డీవైఎఫ్ఐకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, యువజన సమస్యల పరిష్కారానికి నూతన నాయకత్వం కృషి చేయాలని కోరారు.

యువతను గంజాయి, బిట్‌కాయిన్‌ వంటి వ్యసనాలు,మోసపూరిత ధోరణుల నుంచి దూరంగా ఉంచేందుకు సామాజిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. యువతలో సామాజిక బాధ్యత,ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తిని పెంపొందించేలా డీవైఎఫ్ఐ కార్యకలాపాలను బలోపేతం చేయాలని సూచించారు.జిల్లా కమిటీకి ఎన్నికైన మొరిగాడి పృథ్వి, యాసరపు ప్రసాద్ మాట్లాడుతూ ఆలేరు ప్రాంత యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, యువతను ఐక్యం చేసి బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -