Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దాం

త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దాం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాలను సెప్టెంబర్‌ 11 నుంచి 17వ తేదీ వరకు జయప్రదం చేయాలని సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ యానాల దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు.ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సాయుధ పోరాట అమరవీరులు కామ్రేడ్‌ ఆరుట్ల రామచంద్రారెడ్డి,కమలాదేవి,లక్ష్మీనరసింహారెడ్డి స్తూపాల వద్ద శుక్రవారం వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.అనంతరం యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ 1947 సెప్టెంబర్‌ 11న రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి,కమలాదేవి తదితరుల నాయకత్వంలో తెలంగాణ ప్రజలు దొరలు, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగించారని గుర్తుచేశారు.

వెట్టిచాకిరీ విముక్తి, దున్నేవాడికే భూమి కావాలనే నినాదాలతో సామాన్య ప్రజలు రోకలిబండ, కారంపొడి వంటి సాధారణ వస్తువులనే ఆయుధాలుగా చేసుకుని భూస్వామ్య దోపిడీకి ఎదురు నిలిచారని తెలిపారు.సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.వారి ఆశయాలు, లక్ష్యాలను పునికి పుచ్చుకుని యువత ప్రజా సమస్యలపై పోరాటాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించి అమరవీరుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ,చెక్క వెంకటేష్,ఎండీ ఇమ్రాన్,చిగుళ్ల లింగం,ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు పోతు ప్రవీణ్‌, మండల కార్యవర్గ సభ్యులు కందుల మధు, గ్రామ శాఖ కార్యదర్శి అన్నబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -