నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 2026-28 సంవత్సరానికి పద్మశాలి మహిళ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పులిజాల కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా చిలువేరు శ్రావణి, కోశాధికారిగా కోట ప్రశాంతి మరియు కార్యవర్గాన్ని సలహాదారులను ఎన్నుకున్నారు. పద్మశాలి మహిళ సంఘం నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన పులిజాల కళ్యాణి ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, పద్మశాలి మహిళ సంఘం అభివృద్ధికి తోడ్పడుతానని, పద్మశాలి సంఘం, శివాలయ కమిటీ చేసే ఉత్సవ కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
మహిళ సంఘం అధ్యక్షురాలుగా తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్, ఆలయ కమిటి అధ్యక్షులు వనం పర్వతాలు, మహిళ సంఘం అధ్యక్షురాలు దాసపత్రి శకుంతల, కోట దశరథం, పులిజాల శ్రీనివాసులు, చిలువేరు ధనరాజ్, దాసు శ్రీనివాసులు, కర్నాటి రాములు, వనం గీత, గుర్రం హైమావతి లు పాల్గొన్నారు.



