Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి నిధులపై అధికారులను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సర్పంచ్

అభివృద్ధి నిధులపై అధికారులను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల సర్పంచులతో శుక్రవారం నాడు యొక్క లేని ఎంపిడిఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో మండలంలోని పలు గ్రామాల గ్రామ సర్పంచ్లు పాల్గొనడం జరిగింది. గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులు సర్పంచులకు సూచించడం జరిగింది. అభివృద్ధి నిర్వహించాలంటే గ్రామపంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్  సర్పంచులు శ్రీనివాస్ డోన్గావ్ , ఆశా రామచందర్ పటేల్ మాదాపూర్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తే , మండల స్థాయి అధికారులేమో అన్ని పనులు సమస్యలు పరిష్కరించాలని చెప్పడం విడ్డూరంగా ఉందని , ఇలాగైతే గ్రామాల అభివృద్ధి ఎలా కొనసాగుతుందని టిఆర్ఎస్ సర్పంచులు సమీక్ష సమావేశంలో అధికారులను ప్రశ్నించడం మరియు ఆరోపించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నంత సేపు సభ సమావేశం ఆసక్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్  ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -