- Advertisement -
22 ఏళ్ల సేవలకు సూపర్ వైజర్, టీచర్లు సత్కారం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలోగల అంగన్ వాడి కేంద్రం-3లో అంగన్ వాడి టీచర్ గా 22 సంవత్సరాలపాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తూ విధినిర్వహణలో మంచిపేరు తెచ్చుకున్న దూలం అన్నపూర్ణ బదిలీపై గణపూర్ మండలం బుర్రకాయల గూడెం గ్రామానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడిచెర్ల సెక్టార్ అంగన్ వాడి టీచర్లు సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అన్నపూర్ణ సేవలకు గుర్తుగా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు లక్ష్మీ,జయప్రద, అరుణ, బాలమ్మ, పద్మ, రుద్రమదేవి, విజయ, శారదా, సౌజన్య, రమా, రజిత పాల్గొన్నారు.
- Advertisement -



