- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన పర్యటనకు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. గాలేలో ఆగస్టు 15న తొలి టెస్టు, ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టు జరగనుంది.
- Advertisement -



