నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ పోలీస్ శాఖలో మే 31న పదవి విరమణ చేసిన సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో వేడుకలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. మే నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది వివరాలు ఎలా ఉన్నాయి.జి. చాందయ్య, ఎస్.ఐ, సి.సి.ఆర్.బి, నిజామాబాద్ గారు పోలీస్ శాఖలో (42) సం॥ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. ఎమ్. సత్యం, ఎస్.ఐ, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ గారు పోలీస్ శాఖలో (41) సం॥ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు.సాబేర్ హుస్సేన్, పి.సి 612, మెండోరా పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖలో (43) సం|| ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. పి. శ్రీనివాసులు, ఎ.ఎస్.ఐ, మెర్తాడ్ పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖలో (35) సం॥ ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , ఏవో ఆసియా బేగం, సి.సి.ఆర్.బి, సి.ఐ సతీష్ కుమార్ , డిచ్పల్లి సి.ఐ శ్రీ మల్లేష్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి (వెల్ఫేర్) శ్రీనివాస్ (అడ్మిన్) సతీష్ (హోంగార్డ్స్) , పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంటు బషీర్ , వనజా రాణి , అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -



