Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘రియల్‌’ మోసాలకు ‘రెరా’ చెక్‌

‘రియల్‌’ మోసాలకు ‘రెరా’ చెక్‌

- Advertisement -

‘రెరా’ చొరవతో కొనుగోలుదారులకు న్యాయం
ప్రిలాంచ్‌ ‌బుకింగ్‌ ‌పేరిట 
దండిగా వసూళ్లు
అనుమతిలేకుండా ఆఫర్‌ 
ప్రకటనలు చట్ట విరుద్ధం
‘యుద్ధం’ నేపథ్యంలో 
ప్రాజెక్టులకు 4 నెలలు గడువు పొడిగింపు
ఫిర్యాదు చేస్తే రేరా కేసు ‌నమోదు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రియల్‌ఎస్టేట్‌ ‌రంగంలో మోసపోతున్న కొనుగోలుదారులకు తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ ‌రెగ్యూలేటరీ అథారిటీ (రేరా) చెక్‌ ‌పెడుతోంది. మోసపోతున్న వారికి చట్ట ప్రకారం న్యాయం చేస్తోంది. ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలు ప్రీలాంచ్‌ ‌బుకింగ్‌ ‌పేరుతో దండిగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అందుకు అనేక ఆఫర్‌ ‌ప్రకటనలు ఇస్తున్నాయి. ముందుగా బుక్‌ ‌చేసుకుంటే డిస్కౌంట్‌ అని, ఈస్ట్‌ ‌పేజ్‌ అని ఇలా అనేక రకాలు మభ్య పెడుతున్నాయి. ఆ డబ్బుతోనే ప్లాట్‌ నిర్మించి, వారికి అప్పగిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆ తర్వాత కనిపించకుండా పోతున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా ఎంతో మంది ప్లాట్‌ కొనుగోలుదారులు మోస పోతున్నారు. ఇది రేరా చట్ట నిబంధనలను ఉల్లఘించడమే అవుతుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల నుంచి రోజుకు దాదాపుగా వంద ఫిర్యాదులు వస్తున్నాయని రేరా అధికారులు చెబుతున్నారు. చాలా మంది రేరా నెంబర్‌ ‌లేని ప్రాజెక్టుల్లో ప్లాట్‌ ‌కొని ఆ తర్వాత మోసపోతున్నారు. రియల్‌ ‌మోసాలకు బలిఅవుతున్న వారికి రేరా చెక్‌ ‌పెడుతోంది. కొన్నిసార్లు సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నది. జయ జూబ్లీ డైమాండ్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ తీసుకుని నిర్మాణపు పనులు పూర్తి చేయకుండా చేతులెత్తేసింది. కొనుగోలుదారుల ఫిర్యాదుమేరకు రేరా సీరియస్‌‌గా తీసుకుంది. రేరా చొరవ తీసుకుని ప్లాట్ల యాజమానులను సంక్షేమ సంఘంగా ఏర్పాటు చేసింది. పెండింగ్‌‌లో ఉన్న నిర్మాణం పనులను పూర్తి చేయించి వారికి ప్లాట్లను అప్పగించింది. ఈ విషయంలో రేరా చూపిన చొరవతో ప్లాట్ల యాజమానులకు పెద్ద ఊరట కలిగింది. ఇప్పటికీ అనేక సంస్థలు రేరా అనుమతి లేకుండా ప్లాట్లను అమ్ముకుంటున్నాయి. సదరు సంస్థతో కొనుగోలుదారులకు సమస్య వచ్చినప్పుడు రేరా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇటీవల ఓ సాప్ట్‌‌వేర్‌ ఇంజినీర్‌ ఆదిత్రి ఎంపైర్‌‌లో ప్లాట్‌ ‌కొన్నాడు. యాజమానికి ఇల్లు అప్పగించే సమయంలో అదనంగా రూ. 5 లక్షలు చెల్లించాలంటూ సంస్థ డిమాండ్‌ ‌చేసింది. ఒప్పందమేరకు మొత్తం చెల్లించిన తర్వాత అదనపు డబ్బు అడుగుతున్నారంటూ కోరుతూ రేరాను ఆశ్రయించారు. దీనిపై రేరా కేసు నమోదు విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ప్లాట్‌ ‌యాజమానికి న్యాయం చేసింది. ముందుగా ప్రకటించిన లేఅవుట్‌ ‌ప్లాన్‌, ప్రణాళిక, స్పెసిఫికేషన్లు, ఫిట్టింగ్స్‌ తదితరాంశాల్లో కొనుగోలుదారుడికి తెలియకుండా రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ మార్పులు, చేర్పులు చేయడానికి వీలులేదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మార్పులు, చేర్పులు చేయాల నుకున్నా…మూడోవ వంతు ప్లాట్ల యాజమానుల నుంచి రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. వారి అనుమతి లేకుండా ఏకపక్షంగా మార్పులు చేస్తే రేరాలో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ప్లాట్‌ కొన్న తర్వాత ఐదేండ్లు లోపు నిర్మాణ లోపాలు తలెత్తితే అందుకు బిల్డరే బాధ్యత వహించాలని చట్టం చెబుతోంది. బిల్డర్‌ ‌లేదా ప్రమోటర్‌, ఏజెంట్ల ‌వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపించకూడదు. ప్లాట్‌ ‌కొనే ముందుగా ఆ సంస్థకు రిజిస్ట్రేషన్‌ ‌నెంబర్‌, బ్యాంక్‌ ‌ఖాతా ఉంటుంది. అందులోనే కొనుగోలుదారులు డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. రేరా చట్టం సెక్షన్‌ 3 ‌ప్రకారం 500 చదరపు మీటర్లు, 8 ప్లాట్స్‌ ‌పరిధి వరకు రేరా అనుమతి అవసరం లేదు. ఆ తర్వాత ప్రతి రియల్‌ ఎస్టేట్‌ ‌ప్రాజెక్టు రేరాలో రిజిస్ట్రేషన్‌ ‌చేయించుకోవాల్సి ఉంటుంంది. రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలో పని చేసే ఏజెంట్లుగా కూడా రేరాలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారే ప్రాజెక్టుల్లో ప్లాట్‌ ‌యాజమానులకు, సంస్థలకు మధ్యవర్తులుగా వ్యవహరించాల్సి. అనుమతి లేకుండా ప్లాట్‌ ‌బుక్‌ చేయడానికి వీలులేదు. ముఖ్యంగా ప్రాజెక్టులు గడువులోగా ఇల్లు అప్పగించకపోయినా, సేల్‌ అగ్రిమెంట్‌ ఉల్లఘించినా, 10శాతానికి కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా ఆన్‌‌లైన్‌ లేదా ఆఫ్‌‌లైన్‌ ‌ద్వారా రేరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే బిల్డర్‌‌కు షోకాజ్‌ ‌నోటీసులు పంపిప్తోంది.
గడువు పొడిగింపు
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా రాష్ర్టంలోని అన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు 4 నెలలు గడవును పొడిగిస్తూ ‘రెరా’ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి పూర్తి కావల్సిన రెరా రిజిస్టర్డ్‌ ‌ప్రాజెక్టులకు ఈ పొడిగింపు వర్తింస్తుందని అధారిటీ తెలిపింది. గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల దృష్య్టా ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయాలని ఈ సందర్భంగా రెరా అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -