Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు

సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
ఇటీవలే లొంగన్ రైతులు జుక్కల్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు నిర్వహించారు. అయితే విక్రయించిన జొన్నల డబ్బులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడంతో సోమవారం రైతులందరూ సొసైటీకి తరలివచ్చారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి రాకేష్ గౌడ్ ను నిలదీశారు. వెంటనే కార్యదర్శి సందిస్తూ.. అమ్మిన హైబ్రిడ్ జొన్నలు నాణ్యతగా లేవని, తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన రైతులు ఆ విషయం మాకు అప్పుడే చేప్పాల్సిందని, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన జొన్నలు నాణ్యత లేకపోతే అప్పుడే తిరస్కరించేది వదిలేసి, తరలించిన తరువాత సాకులు చెబుతున్నారని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అధికారుల వలన వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు తిరిగి పంపాలంటే వచ్చి, పోయే ట్రాన్స్ పోర్టు కిరాయిని రైతులే భరించాలని మెలిక పెట్టారు. దీంతో ఈ సమస్యను జుక్కల్ నవతెలంగాణ విలేకరికి రైతులు వివరించారు. వెంటనే రిపోర్టర్ సొసైటీ కార్యదర్శిని ఫోన్ లో సంప్రదించగా..అధికారులతో మాట్లాడి, ఎలాంటి తరుగు లేకుండా రైతుల ఖాతాలలో డబ్బు త్వరలోనే జమచేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రైతులు సొసైటీ కార్యదర్శితో పాటు నవతెలంగాణ విలేకరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా..సోసైటి అధ్యక్షుడు లొంగన్ గ్రామానికి చెందిన వ్యక్తి కావడం కొసమెరుపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -