నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం M.B.A, M.B.A హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ) దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, లోగాని, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ లో చేరాలంటే తెలంగాణ ఐ సెట్ లోగాని, ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే (Braoucet) ప్రవేశ ప్రరీక్షలోగానీ తప్పని సరిగా అర్హత సాధించాలి. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించాలి.ఎస్సి, ఎస్టీ లకు 45 శాతం మర్కులు తప్పనిసరి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు అపోలో హాస్పిటల్, కిమ్స్ ,డెక్కన్ మెడికల్ కాలేజ్ లోని ఎంబీఏ RVM hospital, Renovo hospital హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ పొందవచ్చు. యూనివర్సిటీలోని జనరల్ ఎంబీఏ లో చేరాలన్నా ఈ ప్రవేశ పరీక్ష రాయలన్నారు. వివరాలకోసం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో కాల్ చేయాలని లేదా www.braouonline.in లో వివరాలు పొందాలన్నారు.
హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరి తేది ఆగస్టు – 5
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



