– అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ ప్రారంభం
– ఈ నెల 7 వరకు డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎ. రమాదేవి తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్టడీ సెంటర్ ను ఆమె పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ లేదా ఐటీఐ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఓపెన్ డిగ్రీలో ప్రవేశానికి అర్హులని తెలిపారు.
ప్రవేశాలు, అర్హతలు, కోర్సుల వివరాల కోసం ఆసక్తి గల విద్యార్థులు అశ్వారావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి,సహా అధ్యాపకులు పాల్గొన్నారు.



